హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సీఈఎస్ఎస్).. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ యూనివ ర్శిటీ (నిజామాబాద్) సహకారంతో రెగ్యులర్ పీహెచ్సీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం సీట్ల సంఖ్య: 12
» విభాగాలు: ఎకనామక్స్, సోషియాలజీ/ఆంత్రో పాలజీ/సోషల్ వర్క్, డెవలప్మెంట్ స్టాటి స్టిక్స్, పొలిటికల్ సైన్స్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్/బిజినెస్ మేనేజ్మెంట్.
» అర్హత: సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా ఎం ఫిల్ ఉత్తీర్ణులై ఉండాలి.
» ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ఆధా రంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.07.2023
» ప్రవేశ పరీక్ష తేది: 27.07.2023
» వెబ్సైట్: www.cess.ac.in