నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్టు(సీయూఈటీ) నోటి ఫికేషనన్ను విడుదలచేసింది. ఒకే పరీక్షతో అన్ని జాతీయ సంస్థల సీట్లకూ పోటీపడే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా మొత్తం 142 విద్యా సంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యా సంస్థలు, రాష్ట్రస్థాయి విశ్వవిద్యా లయాలు, డీమ్డ్ యూనివర్శిటీలు, ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రవేశాలు పొందవచ్చు.
» కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంఎఫ్ఎ, ఎంపీఏ, ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ వొకేషన్, ఎంఎడ్, ఎంఎల్ ఐఎస్సీ, ఎంపీఈడీ, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంకాం తదితరాలు.
» అర్హత:ఇప్పటికే డిగ్రీ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తు తం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్న విద్యా ర్థులు సీయూఈటీ రాయవచ్చు.పలు కోర్సులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది. మిగిలిన వాటికి డిగ్రీ లో సంబంధిత కోర్సు చదివినవారై ఉండాలి. » పరీక్ష విధానం: పరీక్ష ఆన్లైన్లో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. రెండు షిఫ్టుల్లో పరీక్ష జరుగు తుంది. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో (లాం గ్వేజ్, సాహిత్య పేపర్లు తప్ప) ఉంటాయి. ఇందులో పార్ట్-ఎ, పార్ట్-బి అనే రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఎ 25, పార్ట్-బిలో 75 ప్రశ్నలు వస్తాయి. పార్ట్-ఎలో జనరల్, పార్ట్- బిలో సంబంధిత సబ్జెక్టు ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.04.2023
» వెబ్సైట్: www.cuet.nta.nic.in
![]() | వాట్సాప్ గ్రూప్ లింక్ |
![]() | బిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ |