కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఐదో తరగతి (ఇంగ్లిష్ మాధ్యమం), ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు బాల, బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐ సమన్వయ అధికారి కె.పద్మజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఐదో తరగతికి ప్రవేశాలకు ఏపీజీపీసెట్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఏపీజీపీసెట్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్/ ఇంటర్ వెబ్సైట్లలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ నెల 24వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుందని పేర్కొన్నారు.
ఇతర సమాచారం కోసం కూడా ఆ వెబ్సైట్లను సందర్శించాలని సూచించారు. జిల్లా సమన్వయ అధికారి లేదా గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్ వివరాల కోసం సంప్రదించొచ్చని పేర్కొన్నారు. ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, జూనియర్ ఇంటర్మీడియెట్ అదే రోజు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.