Thu. Nov 30th, 2023

కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్).. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశా లకు సంబంధించి ప్రకటనను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.

» సీట్ల రిజర్వేషన్: ఎస్సీ అభ్యర్థులకు 15%, ఎస్టీ అభ్యర్థులకు 7.5%, ఓబీసీ అభ్యర్థులకు 27%, దివ్యాంగులకు 3% సీట్లు కేటాయించారు.
» వయసు: ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలంటే.. మార్చి 31 నాటికి విద్యార్థి వయసు ఆరు నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉండాలి. రెండో తరగతి, మూడో తరగతిలో ప్రవేశానికి ఏడు నుంచి తొమ్మిదేళ్ల మధ్య, నాలుగో తరగతికి 8-10, అయిదో తరగతికి 9-11, ఆరుకు 10-12, ఏడుకు 11-13, ఎనిమిదికి 12-14, తొమ్మిదికి 13-15, పదికి 14-16 ఏళ్ల మధ్య ఇలా ప్రతి తరగతికి నిర్దేశించిన మేరకు వయసు ఉండాలి. రిజర్వ్ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

» ఎంపిక విధానం: ఎనిమిదో తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టమ్ ప్ర కారం సీటు కేటాయిస్తారు. సీట్ల సంఖ్య కంటే దర ఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ సిస్టమ్ ద్వారా విద్యార్థులను ఎంపికచేస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. పదకొండో తరగతి ప్రవేశాలకు సంబంధించి పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పదో తరగతిలో సీట్లు మిగిలితే ప్రవేశాలు నిర్వహిస్తారు.
» ఒకటో తరగతి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభతేది: 27.03.2023.
» ఒకటో తరగతి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 17.04.2023.
» రెండో తరగతి, ఆపై తరగతులు ఆన్లైన్ రిజిస్ట్రే షన్ ప్రారంభ తేది (పదకొండో తరగతి మినహా యించి): 03.04.2023
» రెండో తరగతి, ఆపై తరగతులు ఆన్లైన్ రిజిస్ట్రే షన్ చివరి తేది(పదకొండో తరగతి మినహాయిం ): 12.04.2023.
» పదకొండో తరగతి రిజిస్ట్రేషన్ తేది: పదో తరగతి ఫలితాలు వెల్లడైన 10 రోజుల తర్వాత నుంచి.

» వెబ్సైట్: www.kvsangathan.nic.in

png-transparent-whats-app-logo-whatsapp-logo-whatsapp-cdr-leaf-text-thumbnailమా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
unnamedబిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *