హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్సీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం సీట్ల సంఖ్య: 15
» విభాగాలు: లా, సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్.
» అర్హత: 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీజీ లేదా కంపెనీ సెక్రటరీ ఎగ్జామ్ / ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఫైనల్ ఎగ్జామ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
» ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.07.2023.
» ఆన్లైన్ ప్రవేశ పరీక్ష తేది: 15.07.2023.
» వెబ్సైట్: www.nalsar.ac.in