Sat. May 25th, 2024

తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (ఎంసెట్) ప్రకటనను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (జేఎన్టీయూ ఎహెచ్) నిర్వహించనుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 03 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష వివరాలు
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2023 (ఎంసెట్).

కోర్సుల వివరాలు
బీఈ, బీటెక్/బీటెక్(బయోటెక్నాలజీ)/ బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)/ బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరిం గ్)/ బీఫార్మసీ/ బీటెక్ (ఫుడ్ఆక్నాలజీ)/బీఎస్సీ(ఆ నర్స్) అగ్రికల్చర్/ బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ(ఫారెస్ట్రీ)/ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ /బీఎఫ్ ఎస్సీ. వీటితోపాటు ఫార్మ్-డి, బీఎస్సీ నర్సింగ్ కూడా ఎంసెట్ ద్వారానే అడ్మిషన్ కల్పిస్తారు.

ఇంటర్మీడియట్(ఎంపీసీ/బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. బీఎస్సీ నర్సింగ్ లో చేరాల నుకున్న విద్యార్థులు ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం పరీక్ష రాయాల్సి ఉంటుంది.

అర్హత:
పరీక్ష కేంద్రాలు
ఎంసెట్ నిర్వహణ తెలంగాణలో 16 పరీక్ష జోన్లు ఏర్పాటు చేశారు. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» దరఖాస్తులకు చివరి తేదీ: 10.04.2023

» ఎడిట్ ఆప్షన్: 2023 ఏప్రిల్ 12 – 14 తేదీవరకు

» రూ.250 – 5 వేల ఫైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2023 ఏప్రిల్ 15 నుంచి మే 02 తేదీ వరకు

» హాల్టికెట్ల డౌన్లోడ్: 2023 ఏప్రిల్ 30 నుంచి

» ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష: 2023 మే 7,8,9 తేదీల్లో

ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష: 2028 మే 10, 11 తేదీల్లో

» వెబ్సైట్: https://eamcet.tsche.ac.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *