Thu. Nov 30th, 2023

తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2023 – 24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవే శాలకు 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాగ్ లాగ్ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది.
» పరీక్ష పేరు: ఈఎంఆర్ఎస్ సెలక్షన్ టెస్ట్ (ఈఎం ఆర్ఎస్ఎస్), ఈఎంఆర్ఎస్ లేటర్ ఎంట్రీ టెస్ట్ (ఈఎంఆర్ఎస్ఎల్).
» మొత్తం సీట్ల సంఖ్య: 233.

» సీట్ల వివరాలు: ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయంలో ఆరో తరగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 28 విద్యాలయాల్లో 1380 (690 బాలురు, 690 బాలికలు) సీట్లు ఉన్నాయి. ఏడో తరగతిలో 26(18 బాలికలు, బాలురు 8), ఎనిమిదో తరగతిలో 103(55 బాలికలు, బాలురు 48), తొమ్మిదో తరగతిలో 104(59 బాలికలు, బాలురు 45).
» అర్హత: ఆరో తరగతిలో ప్రవేశాలు పొందాలను కునే విద్యార్థులు తప్పనిసరిగా 2022-23 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదివి ఉం డాలి. 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి వరుసగా 6,7,8 తరగతుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష(పట్టణ ప్రాంతం), రూ.లక్షన్నర(గ్రామీణ ప్రాంతం) మించకూడదు.
» వయసు: 31.03.2023 నాటికి ఆరో తరగతికి 10-13ఏళ్లు, ఏడో తరగతికి 12-15 ఏళ్లు, ఎని మిదో తరగతికి 13-16 ఏళ్లు, తొమ్మిదో తరగ తికి 14-17 ఏళ్ల మధ్య ఉండాలి. దివ్యాంగు లకు రెండేళ్ల సడలింపు ఉంటుంది.

» ఎంపిక విధానం: రాతపరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వే షన్ ఆధారంగా విద్యార్థులను ఎంపికచేస్తారు.

» పరీక్ష విధానం: ఆరో తరగతికి 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ, అర్థ మేటిక్, లాంగ్వేజ్ అంశాల్లో ప్రశ్నలు అడుగు తారు. 7, 8, 9 తరగతులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్, రీజనల్ లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్ మీడి యంలో పరీక్షనిర్వహిస్తారు.
» దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.04.2023.

» ప్రవేశ పరీక్ష తేది: 07.05.2023.
» పరీక్ష ఫలితాల ప్రకటన తేది: 30.05.2023.

» మొదటి దశ ప్రవేశాలు: 01.06.2023 నుంచి 10.06.2023.
» వెబ్సైట్: https://fastses.telangana.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *