సాగర్ సిమెంట్స్ చేతికి వచ్చిన ఆంధ్రా సిమెంట్ ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్సీ ఎల్డీ (జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్) చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియలో ఆంధ్రా సిమెంట్, ను ‘సాగర్ సిమెంట్ కంపెనీ దక్కించుకున్న విషయం విదితమే. దీనిపై ఎన్సీఎలీ ఉత్తర్వులు జారీ అయినందున, తదు పరి కార్యాచరణను సాగర్ సిమెంట్స్ చేపట్టింది.
ఆంధ్రా సిమెంట్ కు చెందిన దాచేపల్లి యూనిట్లో ఉత్పత్తి కార్యకలాపాలను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో
భాగంగా దాదాపు 600 మంది. ఉద్యోగులు- కార్మికులను నియమించనున్నట్లు సాగర్ సిమెంట్స్ వెల్లడించింది. ఇందులో శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, సిబ్బంది ఉంటారని వివరించింది. మరోపక్క ముడి పదా ర్థాల సరఫరాదార్లు, సిమెంటు పంపిణీదార్లతో సంప్ర దింపులు చేపట్టినట్లు పేర్కొంది. వ్యయాలు తగ్గిం చుకోవడంతో పాటు, ఉత్పత్తి చేసిన సిమెంటుకు అధిక అమ్మకం ధర సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించింది..