Thu. Nov 30th, 2023

పెడన జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 22 పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ గీతాబాయి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీడియాట్రీషన్ పోస్టులు-5, గైనకాలజిస్ట్ పోస్ట్-1, మెడికల్ ఆఫీసర్ పోస్టులు- 16, టెలి మెడిసిన్, నేషనల్ అర్బన్ హెల్త్మేషన్, ఎస్ఎన్సీయూ, ఎన్ఆర్సీ, ఎన్టీఎసీయూ, ఆర్బీఎస్కే విభాగాల్లో పోస్టులను భర్తీ చేయను న్నామన్నారు. పూర్తి వివరాలు krishna.nic.in వెబ్సైట్లో ఉంచామని, దరఖాస్తు ఫారాలు కూడా అందులోనే ఉన్నాయన్నారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *