Thu. Nov 30th, 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించే ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు అయితే కాదు. ఎంపికైన అభ్యర్థులు విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు నుంచి బోర్డు దగ్గర పని చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు వేతనం అర్హత పరీక్ష ఫీజు ఎంపిక విధానం తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం

మొత్తం 12 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది

జూనియర్ అసిస్టెంట్ : 11 పోస్టులు

డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ : ఒక పోస్టు

విద్యార్హతలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉండాలి అలాగే టైపింగ్ స్కిల్స్ తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి అంటే ఎమ్ ఎస్ ఆఫీస్ , లేదా pgdca లేదా డి సి ఎ, లేదా ఇంజనీరింగ్ సర్టిఫికెట్ , లేదా కంప్యూటర్ సబ్జెక్ట్ తో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి

వయసు పరిమితి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 1 జనవరి 2023 నాటికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉండాలి

పరీక్ష ఫీజు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు ₹500 ఆన్లైన్ ద్వారా చెల్లించాలి

ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లో వచ్చిన మార్కులు అలాగే కంప్యూటర్ టెస్ట్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది

ముఖ్యమైన తేదీల వివరాలు:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 7 జూలై 2023

కంప్యూటర్ proficiency test తేదీ : 16 జూలై 2023 నుంచి 17 జూలై 2023

ఫైనల్ అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడి : 19 జూలై 2023

ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు ద్వారా 7 జూలై 2023 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

Apply OnlineClick Here
NotificationClick Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *