Sat. May 25th, 2024

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి వైద్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండేళ్ల కాలపరిమితితో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపడతారు.

ఉద్యోగం పేరు : హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్
మొత్తం ఖాళీలు : 47 పోస్టులు
అర్హతలు : ఎంబీబీఎస్/బీడీఎస్ పూర్తి చేసి హాస్పిటల్ అడ్మిని స్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ/హాస్పిటల్ మేనేజ్మెం ట్/ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్/ఎంబీఏ హ్యూమన్ రిసోర్స్ కోర్సులు చేసి, ఇతర అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు : ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు మించకుండా ఉం డాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్లకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ. వెయ్యి, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్య ర్థులకు రూ.750 చొప్పున దరఖాస్తు రుసుం ఉంటుంది.
దరఖాస్తు విధానం : https://dmeaponline.com ఆన్లైన్ అప్లికేషన్ ను అందుబాటులో ఉంచారు. బుధవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెట్టారు. అర్హులైన వైద్యులు 17 జనవరి 2023 తేదీలోగా దరఖాస్తు చేసు కోవాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *