జయవాడలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్)లో నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ జాయింట్ డైరెక్టర్ సీహెచ్ శేఖర్ తెలిపారు. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) సౌజన్యంతో ఈ శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 30 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ‘ప్లాస్టిక్స్ ప్రొడక్ట్ మాన్యుఫాక్చరింగ్ ఆపరేటర్’ కోర్సులో 4 నెలల పాటు శిక్షణ ఉంటుందన్నారు.
కనీసం ఎనిమిదో తరగతి చదివి, 18-28 సంవత్స రాల వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపికైన వారికి ఉచిత యూనిఫాం, ట్రైనింగ్ కిట్, సేఫ్టీ షూస్తో పాటుగా ఉచిత భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తామన్నారు. తరగతి శిక్షణ విజయవంతంగా పూర్తిచేసు కున్న వారికి మరో 2 నెలలు పరిశ్రమల్లో ఇటప్ ఉంటుందని, అనంతరం వారికి సర్టిఫికెట్ ఇచ్చి ప్రముఖ ప్లాస్టిక్స్, అనుబంధ సంస్థలలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామ న్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 78935 86494 నంబర్లో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.