ఇండియన్ పోస్టల్ విభాగంలో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు సంబంధించి జనవరి నెలలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికీతెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం దేశ వ్యాప్తంగా 40,889 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆంధ్ర ప్రదేశ్ 2480 పోస్టులు, తెలంగాణ 1266 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి..
అయితే తాజాగా ఐదవ జాబితా విడుదలైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుండి 219 మంది, తెలంగాణ నుండి 175 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
అభ్యర్థులను పదవతరగతి లో సాధించిన మార్కులు మరియు కంప్యూటర్ జనరేటెడ్ పద్దతిలో రిజర్వేషన్ అనుసరించి ఎంపిక చేశారు. ఎంపికైనవారికి పోస్టు ద్వారా సమాచారం అందుతుంది. అభ్యర్థుల వివరాలను https://indiapostgdsonline.gov.in/ అనే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.