న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా 7 జూలై 2023 లోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఉద్యోగం పేరు : స్పెషలిస్ట్ ఆఫీసర్
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 183 పోస్టులు
పోస్టుల వివరాలు : ఆఫీసర్ లా మేనేజర్, చార్టెడ్ అకౌంటెంట్, ఫారెక్స్ డీలర్, ట్రెజరీ డీలర్ ,ఎకనామిస్ట్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, మార్కెటింగ్ రిలేషన్షిప్ మేనేజర్, సాఫ్ట్వేర్ డెవలపర్ తదితర పోస్టులు
అర్హతలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ పోస్ట్ ను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ లేదా బి ఈ / బీటెక్ లేదా బిఈ లేదా చార్టెడ్ అకౌంటెంట్ లేదా ఎంసీఏ లేదా పీజీ డిగ్రీ లేదా ఎంబీఏ లేదా pgdbm లేదా పీజీడిబిఏ లో అర్హత కలిగి ఉండాలి
వయస్సు పరిమితి : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు పరిమితి 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి రిజర్వేషన్లు కింద ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ కేటగిరి సంబంధించిన అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయసు పరిమితి ఉంది
జీతభత్యాలు : ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 36 వేల రూపాయలు నుంచి గరిష్టంగా 78235 రూపాయల వరకు వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి అభ్యర్థులు 150 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 850 రూపాయలను దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
దరఖాస్తు విధానం : ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా 7 జూలై 2023 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి