నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న రెప్కో మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ బ్యాంకులో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు చెన్నైలో పని చేయవలసి ఉంటుంది. ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా 19 జూలై 2023 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు, వయసు పరిమితి, జీతభత్యాలు, ఎంపిక విధానం మరియు దరఖాస్తు ఫీజు ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకుందాం.
మొత్తం ఉద్యోగాల సంఖ్య 140 పోస్టులు
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
సీనియర్ మేనేజర్ 10 పోస్టులు
మేనేజర్ 10 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ 35 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ 35 పోస్ట్లు
అడ్మిన్ అసిస్టెంట్ 50 పోస్టులు
అర్హతలు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ పోస్ట్ ను అనుసరించి గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి
వయసు పరిమితి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు పరిమితి 28 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 3.5 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా 8 లక్షల రూపాయల వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు గా ₹500 ఆన్లైన్ ద్వారా చెల్లించాలి
దరఖాస్తు విధానము : ఈ ఉద్యోగాలకు ఆసక్తి అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థులు repco micro ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్సైట్ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 19 జూలై 2023