తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి కానుకగా ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ – 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే గ్రూప్ -1 నోటిఫికేషన్ ద్వారా 503 పోస్టులను , అలాగే గ్రూప్ -04 నోటిఫికేషన్ ద్వారా 9,168 ఉద్యోగాలకు నోటిఫికేషన్లను ఇప్పటికే విడుదల చేసింది.
తాజాగా మరో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. 783 గ్రూప్-2 పోస్టులను TSPSC భర్తీ చేయనుండటంతో నిరుద్యోగులు ఎంతో సంతోషిస్తున్నారు. గతంలో 1032 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేసిన TSPSC.. ఆ స్థాయిలో గ్రూప్-2 కింద మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడం ఇదే తొలిసారి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అందరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ జనవరి 18 వతేది నుండి మొదలు కానుంది.