సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజినీరింగ్ ఆఫీసర్ గ్రేడ్-1, టెక్నీషియన్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు బీఈ/బీటెక్, గేట్ స్కోర్, టెక్నీషియన్ గ్రేడ్-1 ఉద్యోగాలకు ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉండాలి. ఆసక్తి గల వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 14న చివరి తేదీ. పూర్తి వివరాలకు https://cpri.res.in వెబ్‌సైట్‌ను చూడగలరు.