సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్).. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్).. పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 1458
» పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్( స్టెనోగ్రాఫర్)-143,
హెడ్ కానిస్టేబుల్(మినిస్ట్రీ రియల్) – 1315
» అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/ విశ్వవిద్యాల యం నుంచి ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. పురుషులు 165 సెం.మీ., మహిళలు 155 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి.
» వయసు: 25.01.2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
» వేతనం: నెలకు ఏఎస్సై పోస్టులకు రూ.29,200 నుంచి రూ.92,300, హెచ్సీ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. హిందీ / ఇంగ్లిష్ భాష,జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలి జెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాల్లో ప్రశ్న లుంటాయి. 90 నిమిషాల వ్యవధి ఉంటుంది.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 04.01.2023
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.01.2023
» సీబీటీ అడ్మిట్ కార్డ్ విడుదల: 15.02.2023.
» కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: 22.02.20 23 నుంచి 28.02.2023 వరకు
» వెబ్సైట్: www.crpf.gov.in