భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాలు మరియు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్ననేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 31 జూలై 2023 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పోస్టుల వారీగా ఖాళీలు, అర్హతలు, వయస్సు, ఎంపిక విధానం మరియు దరఖాస్తు ఫీజు లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో మొత్తం 4062 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది
మొత్తం ఖాళీల సంఖ్య: 4062
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
ప్రిన్సిపల్ 303
పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ 2266
అకౌంటెంట్ 361
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 759
ల్యాబ్ అటెండెంట్ 373
విభాగాల వారీగా ఖాళీల వివరాలు చూసినట్లయితే మరాఠీ, ఒడియా, తెలుగు, బెంగాలీ, హిందీ, మాథ్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ హిస్టరీ బయోగ్రఫీ తదితరాలు
అర్హతలు :
ప్రిన్సిపల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మరియు మాస్టర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి కనీసం పన్నెండు సంవత్సరాలు పని అనుభవం ఉండాలి వయసు 50 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రిన్సిపాల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు 78,800 నుంచి 2,09,200 జీతంగా చెల్లిస్తారు.
pgt ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈడీ పీజీ డిగ్రీ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ లేదా ఎంసీఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి వయస్సు 40 సంవత్సరాల లోపు ఉండాలి. పి జి టి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు 47,600 నుంచి 1,51,100 జీతంగా చెల్లిస్తారు.
అకౌంటెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ పాస్ అయి ఉండి వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి. అకౌంటెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు 35,000 నుంచి 1,24,000 జీతంగా చెల్లిస్తారు.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. జె ఎన్ ఏ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు 19,900 నుంచి 63,200 జీతంగా చెల్లిస్తారు.
ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకు నెలకు 18000 రూపాయలు నుంచి 56,900 రూపాయలు వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కేటగిరీలను బట్టి దరఖాస్తు ఫీజు అనేది ఉంటుంది ప్రిన్సిపాల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెండు వేల రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి pgt ఉద్యోగాలకై 1500 రూపాయలు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు ₹1000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి
ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల యొక్క అధికారిక వెబ్సైట్ నుంచి 31 జూలై 2023 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి