Thu. Nov 30th, 2023

న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్).. దేశవ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్వో-రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎస్ఎస్ఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 2674 (ఆంధ్రప్రదేశ్ రీజియన్లో 39, తెలంగాణ రీజియన్లో 116 ఖాళీలు).
» అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలు లేదా నిమిషా నికి 30 హిందీ పదాలు కంప్యూటర్లో టైపింగ్ చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి.


» వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుం చి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 -15 ఏళ్లు, ఎక్స్-సర్వీస్మెన్లకు 3 నుంచి 8 ఏళ్ల సడలింపు ఉంటుంది.
» వేతనం: నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూ టర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మె డికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. » పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 150 ప్రశ్నలకు 600 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. జనరల్ ఆప్టిట్యూడ్(30 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్/జన రల్ అవేర్నెస్(30 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఎబిలిటీ(30 ప్రశ్నలు), జనరల్ ఇంగ్లిష్ (50 ప్రశ్నలు), కంప్యూటర్ లిటరసీ(10 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.


» ఆన్లైన్ దరఖాస్తు / రిజిస్ట్రేషన్ తేదీలు: 27.03.2023 నుంచి 26.04.2023 వరకు
» దరఖాస్తు సవరణ తేదీలు: 27.04.2023 నుంచి 28.04.2023 వరకు.
» వెబ్సైట్: www.epfindia.gov.in

png-transparent-whats-app-logo-whatsapp-logo-whatsapp-cdr-leaf-text-thumbnail మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
unnamedబిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *