Thu. Nov 30th, 2023

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం దాదాపుగా 458 కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 27 జూన్ 2023 నుంచి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 26 జూలై 2023 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగం పేరు : కానిస్టేబుల్ డ్రైవర్

మొత్తం ఖాళీల సంఖ్య : 458 పోస్ట్లు

రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు జనరల్ కేటగిరీ 195 పోస్టులు, obc category 110 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరి 42 పోస్టులు , ఎస్సీ కేటగిరీ 74 పోస్టులు, ఎస్సీ కేటగిరి 37 పోస్టులు కేటాయించారు

విద్యార్హతలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పదవతరగతి ఖచ్చితంగా పాసై ఉండాలి దాంతోపాటు ఖచ్చితంగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిలో జనరల్ కేటగిరి ఓబిసి మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ₹100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి . ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు

దరఖాస్తు చేయు విధానం ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 27 జూన్ 2023 నుంచి ప్రారంభమైంది ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 26 జూలై 2023 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *