Fri. Mar 29th, 2024

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-2023, జూన్ (యూజీసీ -నెట్) పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్). విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను జూన్ లో నిర్వహించను న్నట్లు యూజీసీ వెల్లడించింది. ఈ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తుంటారు.

» సబ్జెక్టులు: అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంత్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ ఆండ్ క్రిమినాలజీ తదితరాలు.

» అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి..

» వయసు: జేఆర్ఎఫ్ కు 01.06.20123 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు గరిష్ట వయోపరిమితి లేదు

» పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీ టీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్ – 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.05.2023.
» దరఖాస్తు సవరణ తేదీలు: 02, 09.06.2023.
» పరీక్ష తేదీలు: 13.06.2023 నుంచి 22.06.2023 వరకు
» వెబ్సైట్: www.ugcnet.nta.nic.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *