ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (ఆర్ఆర్సీ)- వెస్ట్రన్ రైల్వే.. 2023-24 సంవత్సరానికి సంబంధించి వెస్ట్రన్ రైల్వే పరిధి లోని డివిజన్ /వర్క్ ప్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య: 3624.
» శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
» ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయిం టర్, డీజిల్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహి కల్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్ మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేటర్(ఏసీ-మెకానిక్), పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్), పీఏఎస్ఎస్ఏ, స్టెనోగ్రాఫర్, మెషినిస్ట్, టర్నర్.
» అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 26.07.2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. రాతపరీక్ష/వైవా ఉండదు.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 27.06.2023.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.07.2023.
» వెబ్సైట్: www.rrc-wr.com