1. తిక్కన ఏ శతాబ్దానికి చెందినవాడు?
– 13వ శతాబ్దం
2. కవిత్రయంలో తిక్కన ఎన్నోవాడు
– రెండోవాడు
3. తిక్కన మొదటి రచన ఏది?
– నిర్వచనోత్తర రామాయణం
4. తిక్కన తన మొదటి గ్రంథం నిర్వచనోత్తర రామాయణాన్ని ఎవరికి అంకితమిచ్చాడు?
– మనుమసిద్దికి
5. తిక్కన రచించిన భారత పర్వాలు ఎన్ని?
– విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలు
6. తిక్కన రచనా శైలి?
– నాటకీయ శైలి
7. తిక్కన బిరుదులు ఏవి?
– కవిబ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు
8. తిక్కన తండ్రి పేరు?
-కొమ్మన
9. స్వప్న వృత్తాంతం చెప్పిన కవుల్లో మొదటి కవి?
– తిక్కన
10. భారతాన్ని తిక్కన ఎవరికి అంకితమిచ్చాడు?
– హరిహరనాథునికి
11. కేతన దశకుమార చరిత్రను ఎవరికి అంకితమిచ్చాడు?
-తిక్కనకు
12. ‘కవీంద్ర లోకాధారుడు’ అని తిక్కన గురించి చెప్పింది?
– కేతన
18. ‘నానారసాభ్యుదయోల్లాసి’ అని తిక్కన దేని గురించి చెప్పారు?
-విరాటపర్వం
14. నిర్వచనోత్తర రామాయణాన్ని తిక్కన ఏమని వర్ణించారు?
– మహాకావ్యం
15. పానుగంటి లక్ష్మీ నరసింహారావు ఏ సంస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నారు?
– పిఠాపురం సంస్థానంలో
16. పానుగంటి లక్ష్మీ నరసింహారావు జన్మ స్థలమేది?
– రాజమహేంద్రవరం వద్దగల సీతానగరం
17. జంఘాల శాస్త్రి పాత్ర సృష్టి కర్త?
– పానుగంటి లక్ష్మీ నరసింహారావు
18. ‘శివ తాండవం’ గ్రంథ కర్త ఎవరు?
– పుట్టపర్తి నారాయణాచార్యులు
19. పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన ఆంగ్ల రచన?
– లీవ్స్ ఇన్ ది విండ్
20. ‘ఒక విజేత ఆత్మ కథ’ రచన ఎవరిది?
– అబ్దుల్ కలాం
21. అబ్దుల్ కలాం జన్మ స్థలం?
– తమిళనాడులోని ధనుష్కోటి
22. నారాయణ శతకం’ రచించింది?
– బమ్మెర పోతన
23. రాజశేఖర శతకం రచించింది?
– సత్యవోలు సుందర కవి
24. శ్రీ భర్గ శతకం రచించింది?
– కూచిమంచి తిమ్మకవి
25. ‘రామదాసు’ అనే పేరు గల శతక కవి?
– కంచర్ల గోపన్న
26. రాజశేఖర శతకంలోని మకుటం?
– శ్రీకర రాజశేఖరా!
27. కుమార శతకాన్ని ఏ ఛందస్సులో రాశారు?
– కంద పద్యాల్లో
28. సర్వేశ్వర శతకాన్ని రచించింది?
-యథావాక్కుల అన్నమయ్య
29. ‘విద్యాధనం’ సమాస నామం?
– రూపక సమాసం
30. ‘ఫణాగ్రము’ సమాస నామం
– షష్ఠీ తత్పురుష సమాసం
31. వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉంటే అది ఏ
అలంకారం?
-దృష్టాంతాలంకారం
32. స- భ- ర- న- మ య- వ అనేవి ఏ పద్య గణాలు?
– మత్తేభం
33. గృహలక్ష్మి స్వర్ణ పతకం పొందిన రచయిత్రి?
– కనుపర్తి వరలక్ష్మమ్మ
34. గాంధీ దండకం రచించింది?
– కనుపర్తి వరలక్ష్మమ్మ
35. ‘ధర్మం నా జీవనం, నీతి నా మతం, సతీ శ్రేయం నా లక్ష్యం’ అన్న రచయిత్రి?
– కనుపర్తి వరలక్ష్మమ్మ
36. ‘విద్యాభివృద్ధి’ ఏ సంధి?
– సవర్ణదీర్ఘ సంధి
37. ‘నెచ్చెలి’ ఏ సంధి?
– ప్రాతాది సంధి
38. ‘నారీ రత్నము’ సమాస సంధి?
| – ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
39. ‘రమ్మని’ ఏ సంధి?
– ఉత్వ సంధి
40. ‘గగన వీధి’ సమాస నామం ?
– సప్తమీ తత్పురుష సమాసం
41. ‘ఆది కాలంలో తిక్కన, మధ్య కాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ మహా కవులు అన్నదెవరు?
-శ్రీశ్రీ
42. తెలుగులో తొలి కథానిక ఏది? రచయిత?
– దిద్దుబాటు, గురజాడ
43. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీని ఎప్పుడు స్థాపించింది?
-1969 44. 1930లో
44. సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణాన్నిరచించింది?
– గిడుగు రామమూర్తి పంతులు
45. తెలుగు వ్యావహారిక భాషా ఉద్యమానికి గిడుగు ప్రారంభించిన పత్రిక?
– తెలుగు పత్రిక
46. కృషీవలుడు’ కావ్య రచయిత?
– దువ్వూరి రామిరెడ్డి
47. ‘హృదయ కళిక సమాస నామం?
– రూపక సమాసం
48. ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యం’ అనేది ఏ సంధి సూత్రం?
– ఉత్వ సంధి
49. ‘ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి’ అనే వాక్యంలోని అలంకారం?
– అతిశయోక్తి
50. ఒక సూర్య గణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్యగణాలు ప్రతి పాదంలో ఉంటే ఆ పద్యమేది?
– తేటగీతి
51. ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ వ్యాకరణ గ్రంథాన్ని రచించింది?
– నన్నయ
52. చాముండికా విలాసం, ఇంద్ర విజయం రచించింది?
– నన్నయ
53. శ్రీశ్రీ పూర్తి పేరు?
-శ్రీరంగం శ్రీనివాస రావు
55. మాత్రా ఛందస్సు గల సాహిత్య ప్రక్రియ?
– గేయం
56. ‘నరకంలో హరిశ్చంద్రుడు’- నాటక రచయిత?
– నార్ల వెంకటేశ్వరరావు
57. గౌరన ఏ శతాబ్దానికి చెందినవాడు?
– 15వ శతాబ్దం
58. సంస్కృతంలో ‘లక్షణ దీపిక రచించింది?
– గౌరన
59. నవనాథ చరిత్ర’ రచించింది?
-గౌరన
60. ‘అద్దె కొంప కథానిక రచయిత?
– కొడవటిగంటి కుటుంబరావు
61. డా. సి. నారాయణరెడ్డి ఏ కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది?
– విశ్వంభర
62. కర్పూర వసంత రాయలు కావ్య రచయిత?
– డా. సి. నారాయణ రెడ్డి
63. విశ్వ దర్శనం రచన ఎవరిది?
– నండూరి రామమోహన రావు
64. ‘మాలపల్లి’ నవలా రచయిత?
– ఉన్నవ లక్ష్మీ నారాయణ
65. ‘కన్యాశుల్కం’ నాటక రచయిత?
– గురజాడ అప్పారావు
66. క్రీస్తు శతకం’ రచించింది?
-జ్ఞానానంద కవి
69. కమలాక్షు నర్చించు కరములు కరములు. ఇది ఏ అలంకారం?
– లాటానుప్రాస
68. మీకు వంద వందనాలు’ ఇది ఏ అలంకారం?
– ఛేకానుప్రాస
69. రెండు కాని, అంతకంటే ఎక్కువ కానీ నామవాచకాల మధ్య ఏర్పడే సమాసం ఏది?
– ద్వంద్వ సమాసం .
70 శ్రీశ్రీ స్వీయ చరిత్ర పేరేమిటి?
– అనంతం
71. కొడవటిగంటి కుటుంబరావు సంపాదకుడిగా పనిచేసిన పిల్లల పత్రిక ఏది?
– చందమామ
72. శ్రీశ్రీ స్థాపించిన సాహిత్య సంస్థ ఏది?
– కవితా సమితి
73. భారతంలోని అధ్యాయాలను ఏమంటారు?
– పర్వాలు
74. శ్రీశ్రీ కవిత్వాన్ని తూచే రాళ్లు తన దగ్గర లేవన్నది ఎవరు?
– చలం
75. శ్రీశ్రీ తన మహాప్రస్థానం రచనను ఎవరికి అంకిత మిచ్చాడు?
– కొంపెల్ల జనార్ధనరావుకు
76. నన్నయ యుగానికి మరో పేరేది?
– అనువాద యుగం
77. ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభిస్తూ నన్నయ చెప్పిన శ్లోకమేది?
-శ్రీవాణీ గిరిజాశ్చిరాయ
78. నన్నయ కాలంలో గణిత శాస్త్ర గ్రంథం రచించిన కవి
– పావులూరి మల్లన
79. శ్రీనాథ కవితా సామ్రాజ్యము’ అనే విమర్శ గ్రంథ రచయిత?
గడియారం వేంకట శేష శాస్త్రి
80. ‘శివ భారతం’ కావ్య రచయిత?
– గడియారం వేంకట శేషశాస్త్రి
81. ‘అమరావతీ పట్టణమున బౌద్దులు విశ్వవిద్యాలయ ములు స్థాపించునాడు’ అనే పద్య రచయిత?
– రాయప్రోలు సుబ్బారావు
82. అమరావతి ఏ రాజుల కాలంలో అభివృద్ధి పొందింది?
– గౌతమీపుత్ర శాతకర్ణి, పులోమావి, పల్లవులు
83. అమరావతి స్తూపం వద్ద రోజూ వేలాదిగా దీపాలు వెలిగించిన వారు?
– బౌద్ధ భిక్షువులు
84. అమరావతి అంటే అర్థం?
-చావులేనిది
85. అమరావతిని రాజధానిగా చేసుకొని పాలించినవారు?
– శాతవాహనులు
86. శాతవాహన రాజులకు కుల గురువు ఎవరు?
– నాగార్జునుడు
87. అమరావతి కేంద్రంగా ఏ మతం విస్తరించింది?
– జైన మతం
88. అమరావతిలో ఉన్న ఏ ఆలయం పంచారామాల్లో ఒకటి?
– అమర లింగేశ్వర స్వామి ఆలయం
89. ‘నవ్యాంధ్ర’ ఏ సంధి?
– సవర్ణ దీర్ఘ సంధి
90. చంపకమాల పాదానికి అక్షరాలు ఎన్ని?
-21
91. ‘కుల గురువు’ సమాసం పేరేమిటి?
– షష్ఠీ తత్పురుష
92. ‘శతాబ్ది సమాసం పేరేమిటి?
– బహువ్రీహి
93. ‘పిల్లి శతకం’ రచించిన కవి?
– బోయి భీమన్న
94. డాక్టర్ బోయి భీమన్న జన్మ స్థలం?
– తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు
95. బింబ ప్రతిబింబ భావాన్ని తెలుపు అలంకారం?
– దృష్టాంతం
96. ఎర్రన ఏ శతాబ్దపు కవి?
-14వ శతాబ్దం (ప్రథమార్థం)
97. ఎర్రన బిరుదు?
– ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు
98. ‘నృసింహ పురాణం’ రచించింది?
– ఎర్రన
99. ఎర్రన తల్లిదండ్రులు?
– తల్లి పోతమాంబిక, తండ్రి సూరనార్యుడు
100. హరి వంశం రచించింది?
– ఎర్రన
101. హరివంశ కావ్యాన్ని ఎర్రన ఎవరికి అంకితమిచ్చాడు?
– ప్రోలయ వేమా రెడ్డి
102. రాజ రాజ నరేంద్రునికి ఎర్రన అంకితమిచ్చిన రచన?
-భారతారణ్య పర్వ శేషం
103. ఎర్రన గురువు ఎవరు?
– శంకర స్వామి
104. ఎర్రన శైలి ఏ విధమైనది
– వర్ణనాత్మకం
105. అష్టాదశ వర్ణనలు ఎర్రన ఏ రచనలో ఉన్నాయి?
– నృసింహ పురాణం
106. తెలుగు భాషకు ప్రామాణిక గ్రంథం ‘బాల వ్యాకరణం రచించింది?
– చిన్నయ సూరి
107. మిత్ర లాభం ఏ సమాసం?
– పంచమీ తత్పురుష
108. ‘సుభాషిత రత్నావళి’ శతక రచయిత?
– ఏనుగు లక్ష్మణ కవి
109. ‘విశ్వామిత్ర చరిత్ర’ గ్రంథ రచయిత?
– ఏనుగు లక్ష్మణ కవి
110. తరిగొండ వెంగమాంబ ఏ శతాబ్దానికి చెందిన కవయిత్రి?
– 18
111. ‘నారసింహ విలాస కథ’ అనే యక్షగానం రచించింది?
– తరిగొండ వెంగమాంబ
112. రాజయోగామృతం అనే ద్విపద కావ్య రచయిత్రి?
– తరిగొండ వెంగమాంబ
113. ‘భక్త చింతామణి’ శతక రచయిత?
– వడ్డాది సుబ్బరాయ కవి
114. భాస్కర శతకం రచించింది?
– మారద వెంకయ్య
115. తెలుగులో వెలసిన మొదటి దృష్టాంత శతకం?
– భాస్కర శతకం
116. కాళహస్తి మహత్యం అనే కావ్యాన్ని ప్రబంధ శైలిలో రచించింది?
– ధూర్జటి
117. ‘సుమతీ శతకం’ రచించింది?
– బద్దెన
118. బద్దెన ఏ శతాబ్దానికి చెందినవాడు?
-13
119. ‘సుమతీ శతకం’ ఏ మకుటంతో ఉంటుంది?
– సుమతీ
120. స్వేచ్ఛ’ అనే ప్రసిద్ధి పొందిన నవల రచించిన ప్రముఖ స్త్రీవాద రచయిత్రి?
– ఓల్గా
121. ‘రామాభ్యుదయం’ రచించింది?
– అయ్యల రాజు రామభద్రుడు
122. అయ్యలరాజు రామభద్రుడు తన రామాభ్యుదయ కావ్యాన్ని ఎవరికి అంకితమిచ్చాడు?
-గొల్లూరి నరసరాజుకు
123. ‘సకల కథా సార సంగ్రహం’ రచించింది?
– అయ్యలరాజు రామ భద్రుడు
124. అయ్యల రాజు రామ భద్ర కవి బిరుదు?
-చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి
126. వర్ణనా ప్రధానమైన కావ్యాల్ని ఏమంటారు?
– ప్రబంధాలు
127. ఏ శతాబ్దాన్ని తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగం అంటారు?
– 16
128. ప్రబంధంలో ఎన్ని వర్ణనలు ఉంటాయి?
-18
129. విద్వాన్ విశ్వం పూర్తి పేరు?
– మీసరగండ విశ్వరూపాచారి
130. విద్వాన్ విశ్వం గొప్ప రచన?
– పెన్నేటి పాట
131. విద్వాన్ విశ్వం ఏ పత్రికల్లో పనిచేశారు?
– ఆంధ్రజ్యోతి, మీజాన్, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి
132. విద్వాన్ విశ్వం జన్మస్థలమేది?
– అనంతపురం జిల్లా తరిమెల గ్రామం
133. విశ్వరూపి నా హృదయం అని ప్రకటించింది?
– విద్వాన్ విశ్వం
134. పులికంటి కృష్ణా రెడ్డి తొలి కథ?
– గూడు కోసం గువ్వలు
135. శ్రీనాథుని తల్లిదండ్రులు?
– భీమాంబ, మారయ
136. శ్రీనాథుని బిరుదు?
– కవి సార్వభౌమ
137. హరవిలాసం రచించింది?
– శ్రీనాథుడు
138. శ్రీనాథుడు నిండు జవ్వనంలో రచించిన ప్రౌఢ ప్రబంధం?
– శృంగార నైషథం
139. శ్రీనాథుడు హర విలాసాన్ని ఎవరికి అంకితమిచ్చాడు?
– అవచి తిప్పయ శెట్టి
140. తెలుగులో మొదటి వీరగాథా కావ్యం?
– పల్నాటి వీర చరిత్ర
141. కాశీ ఖండం ఏ పురాణంలోని కథకి అనువాదంగా శ్రీనాథుడు రచించాడు?
– స్కాంద పురాణం
142. శ్రీనాథుని తొలి కావ్యం?
– మరుత్తరాట్చరిత్ర
143. శ్రీనాథుడు ఎవరి ఆస్థాన కవి?
– పెద కోమటి వేమా రెడ్డి
144. శ్రీనాథుడు ఏ రాజు ఆస్థానంలో డిండిమ భట్టు కంచు ఢక్కాను పగుల గొట్టించాడు?
– ద్రౌఢ దేవరాయలు
145. పల్నాటి వీర చరిత్ర ఏ ఛందస్సులో ఉంది?
– ద్విపద
146. నా కవిత్వంబు నిజము కర్ణాట భాష అని శ్రీనాథుడు ఏ.కావ్యంలో చెప్పాడు?
– భీమ ఖండం