మన రాష్ట్రంలోని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు మరియు జాతీయ పార్కుల గురించి రాయండి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో 22 వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు దాదాపు 9164 చ.కి.మీ.లలో విస్తరించి ఉన్నవి. వీటిలో 3 కేంద్రాలు ప్రత్యేకంగా పక్షుల కోసం కేటాయించడము జరిగింది. 33 కేంద్రాలు, మొసళ్ల కోసం కేటాయించారు. మొసళ్ళ కేంద్రాలు ఆదిలాబాద్ జిల్లాలోని. ‘లంజమడుగు’ (38 చ.కి.మీ)లోను, మెదక్ జిల్లాలోని ‘మంజీర (20 చ.కి.మీ.) లోను, తూర్పుగోదావరి జిల్లాలోని ‘కోరింగ’ (23 చ.కి.మీ.) లోను ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు (673 చ.కి.మీ.) లోను, నెల్లూరు జిల్లాలో పులికాట్ (500 చ.కి.మీ.)లోను, నేలపట్టు లోను పక్షిరక్షణ కేంద్రాలున్నాయి.
వెహ్రూ జంతు ప్రదర్శనశాల: హైదరాబాద్ సమీపంలోని బెంగళూర్ జాతీయ రహదారిపై 302 ఎకరాల వైశాల్యములో స్థాపించారు. ఇక్కడ రకరకాల జంతువులు ఎన్నో ఇతర దేశాలనుండి తెప్పించి ఈ జంతు ప్రదర్శనశాలలో కాపాడుచున్నారు.
పక్షులు : కొన్ని దశాబ్దాల నుంచి మధ్య ఆసియా నుంచి అనేక రకాల పక్షులు వచ్చేవి. చెట్లు చేమలు తరుగుదల మూలంగా, నరస్సులలో నీటి తగ్గుదల వల్ల వాటి రాక తగ్గింది. పులికాట్ సరస్సు 500 చ.కి.మీ. వైశాల్యంతో అనేక రకాల పక్షులకు నివాసస్థలంగా ఉపయోగపడుతోంది. ఇది కాక నెల్లూరు జిల్లాలోని నేలపట్టు కేంద్రం పక్షుల కేంద్రంగా పేరుగాంచింది.
పక్షుల కేంద్రాలు:

పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు (673 చ.కి.మీ.)
నెల్లూరు జిల్లాలోని పులికాట్ (100 చ.కి.మీ.) మరియు నేల పట్టులోను పక్షి రక్షణ కేంద్రాలున్నాయి.
వరంగల్, ఖమ్మం జిల్లాల మధ్య ఉన్న కిన్నెరసాని ప్రాంతం, మెదక్ జిల్లాలో ఉన్న పోచారం, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కావలి కేంద్రాలు వన్య ప్రాణ సంరక్షణ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది.
బట్ట మేకల పక్షులు:
మనదేశంలో అరుదుగా కనబడే బట్టిమేకల పక్షులు రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని రోళ్లపాడు వద్ద కనిపించినది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వన్యప్రాణుల సంరక్షణకు చిహ్నంగా రాష్ట్ర జంతువుగా కృష్ణజింకను, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర చెట్టుగా వేపచెట్టు గుర్తించినది.

అడవి జంతువులు: దుప్పి, కొండగొర్రె, కణుజు, అడవిపంది సాధారణంగా చిన్న అడవులలో కనిపించే జంతువులు. ఎనుబోతు అనే అడవి జాతి దున్నపోతు ఎక్కువగా గోదావరి నది ఉత్తర దిశ అరణ్యాలలో తిరుగుతుంది. ముఖ్యంగా విశాఖ, వరంగల్, ఆదిలాబాద్ కొండలలో ఈ జాతి దున్నపోతులు ఉన్నాయి. నాలుగు కొమ్ముల కొండ గొర్రెలు ఎక్కువగా రాయలసీమలో మాత్రమే ఉన్నాయి. జింకలు దాదాపు అన్నిజిల్లాలలో ఉన్నాయి. బురుడు జింకలు కర్నూలు, అనంతపూర్ జిల్లాలో ఉన్నాయి. అలాగే కడప, నెల్లూరు జిల్లా సరిహద్దులోని వెలికొండ పశ్చిమ ప్రాంతాలలో తెలంగాణా జిల్లాలోని రక్షిత అడవుల లో పెద్దపులులు, చిరుతపులులు ఉన్నాయి. గోదావరి జిల్లా దక్షిణ భాగములో పొడల లేడి, కణుజు, మామూలు లేడి ఉన్నాయి. సివంగి, చారల సివంగి, రకరకాల పిల్లులు, ముంగీస, నక్క, గుంటనక్క, రేచు కుక్క, ఎలుగుబంటు మొదలైనవి చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో అన్ని అడవులలో ఉన్నాయి. నాగార్జున గర్ లో మొసళ్ళ పెంపక కేంద్రము ఒకటి స్థాపించారు. మన దేశములో అరుదుగా కనపడే ‘బట్టమేకలపిట్ట’- (Blue Bustard) మన రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ‘రోళ్ళపాడు’ వద్ద కనిపించింది. ఈ పక్షులు మన రాష్ట్రములో 50 వరకు ఉన్నాయని అంచనా. మనరాష్ట్ర ప్రభుత్వం వన్య ప్రాణుల సంరక్షణకోసము చిహ్నంగా కృష్ణజింక, పాలపిట్ట, వేపచెట్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు, పక్షి, చెట్టుగా వరుసగా గుర్తించింది.
మొసళ్ళ సంరక్షణ కేంద్రాలు
- ఆదిలాబాద్ జిల్లాలోని లంజమడుగు (38 చ.కి.మీ) * మెదక్ జిల్లాలోని మంజీర (20 చ.కి.మీ)
- తూర్పు గోదావరి జిల్లాలోని కోరింజ (23 చ.కి.మీ)లలో మొసళ్ల రక్షణ కేంద్రాలున్నాయి.
టైగర్ ప్రాజెక్టు
నాగార్జునసాగర్, శ్రీశైలం మధ్య ఉన్న అడవి ప్రాంతాన్ని వన్యప్రాణి రక్షిత ప్రాంతం కోసం కేటాయించారు. దీనికి “రాజీవ్ గాంధీ టైగర్ లోయ” అని పేరు. దీని విస్తీర్ణం 3, 568 చ.కి.మీ. భారతదేశంలో అతి పెద్ద టైగర్ ప్రాజెక్టు ఇది.
టైగర్ ప్రాజెక్టును 1973 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
మిగిలిన వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు
మహావీర్ హరిత వనస్థలి: ఇది హైదరాబాద్కు 15 కి.మీ.ల దూరములో 40 చ.కి.మీ. వైశాల్యములో ఉంది. జింకలకు, కుందేళ్ళకు రక్షణ స్థలంగా ఏర్పాటయింది. నాగార్జునసాగర్, శ్రీశైలం మధ్య 3,568 చ.కి.మీ. వైశాల్యము అడవి ప్రాంతాన్ని వన్యప్రాణి రక్షిత ప్రాంతము కోసం కేటాయించారు. దీనికి ‘టైగర్య’ అని పేరు పెట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండ వద్ద 591 చ.కి.మీ. వైశాల్య ప్రదేశం, వరంగల్, ఖమ్మం జిల్లాల మధ్య 635 చ.కి.మీ. వైశాల్యము ఉన్న కిన్నెరసాని ప్రదేశము, మెదక్ జిల్లాలో 130 చ.కి.మీ. వైశాల్యము ఉన్న పోచారము, వరంగల్ జిల్లాలోని 803 చ.కి.మీ.ల ఏటూరు నాగారము, 800చ.కి.మీల పాకాల కేంద్రము, ఆదిలాబాద్ జిల్లాలోని 293 చ.కి.మీ. ఉన్న కావలి కేంద్రము వన్యప్రాణి రక్షణ ప్రాంతాలుగా గుర్తించడమైనది. నాగార్జునసాగర్ – శ్రీశైలము వన్యప్రాంత ప్రదేశములో ఫిబ్రవరి 1983 సం.లో ‘ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టు’ పులుల సంరక్షణకోసం ఏర్పాటు చేయబడింది. ఈ కేంద్రంలో పులుల సంఖ్యను పెంచటానికి ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఈ పథకం చేపట్టిన తరువాత సుమారు 14 పులులు 1979లో ఉండగా 1982 సం.కి వాటిసంఖ్య 200కి దాటింది. నేటి పులుల సంఖ్యలో 75 శాతం పులులు ఈ కేంద్రంలోనే అభివృద్ధి చెందాయి.