Sat. May 25th, 2024

నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇది గత రెండు దశాబ్దాలుగా పెరుగుతున్నదే కానీ తగ్గుముఖ పట్టడం లేదు. భారత్ కూడా గత ఇరవైయ్యేళ్లుగా ఉగ్రవాద సమస్యతో సతమతమవుతున్నది.


ఒకప్పుడు ఉగ్రవాదానికి విలువలు ఉండేవి. ఉదాహరణకు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుపాకి చేత బట్టిన వారిని ప్రభుత్వ ఉగ్రవాదులుగా ముద్రవేసినప్పటికీ, ప్రజలు వారిని దేశభక్తులుగా కీర్తించి, వారి కోసం ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉండేవారు. ఉగ్రవాదం రా రాను వికృతరూపం దాల్చటంతో ప్రజలు వారికి దూరమయ్యారు. గతంలో ఉగ్రవాదులు ప్రభుత్వ సైనికులపై దాడులు చేసేవారు. ప్రభు స్థావరాలను ధ్వంసం చేసేవారు. అంతేతప్ప అమాయక పౌరుల జోలికి వచ్చేవారు కారు. అప్పుడు ప్రభుత్వానికి, ఉగ్రవాదులకు మధ్య మాత్రమే పో సాగేది. కానీ, కాలం గడుస్తున్న కొద్దీ ఉగ్రవాదుల సిద్ధాంతంలో మార్పు వచ్చింది. లక్ష్యసాధనకు ఏమైనా చేయవచ్చనే నీచ సిద్ధాంతాని రూపొందించుకున్నారు. రైళ్లలో, బస్సుల్లో బాంబులు పెట్టడం, పసిపిల్లలు ఆడుకునే పార్కుల్లో బాంబులు పేల్చటం వంటి దుస్సంఘటనలు ఈ ధోర ఫలితంగా జరుగుతున్నవే. వాస్తవానికి ప్రభుత్వానికి, ఉగ్రవాదులకు మధ్య పోరుకి సాధారణ ప్రజలు ఏ విధంగాను కారకులు కారు. అయితే మరెందు కం ఉగ్రవాదులు అమాయకులపై విరుచుకుపడతారు? తమ చర్యల ద్వారా ప్రజల్లో భయాందోళనలను కలిగించి, తద్వారా ప్రభుత్వాన్ని లొంగు దీసుకోవటమే ఉగ్రవాదుల లక్ష్యమని భావించవలసి ఉంది. ఒకే లక్ష్యం కోసం కొన్ని ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నప్పుడు ఒకదానితో మరొకటి ఆధిపత్యం కోసం పరస్పరం పోరాడుకుంటాయి. ఆ పోరులో ఉగ్రవాదులే కాక, వారికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహకరించే వారు, అసలు ఉగ్రవాదంతో సంబంధం లేని దారిన పోయేవారు కూడా ప్రాణాలు కోల్పోతుంటారు. శ్రీలంకలో అయిదారు తమిళ ఉగ్రవాద సంస్థల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఇలాగే జరిగింది. ఉగ్రవాదులు దేశాధినేతను, దేశాధినేత కాగల సత్తా ఉన్నవారిని హతమార్చటం లక్ష్యంగా పెట్టుకుంటారు. దేశం సమర్థవంతమైన నాయకత్వాన్ని కోల్పోతే తమ ఆటలు సాగుతాయన్నది ఉగ్రవాదుల వికృత సిద్ధాంతాల్లో ముఖ్యమైంది. శ్రీలంకలో ప్రధాన ఉగ్రవాద సంస్థగా మిగిలిన ఎల్టిటిఇ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని, శ్రీలంక అధ్యక్షుడు ప్రేమదాసను, ఇంకా ఎందరో నాయకులను ఇదే పైశాచిక లక్ష్యంతో పొట్టన పెట్టుకుంది.


ఈ ఉగ్రవాదులు ఎవరు? వారు తమంతట తామే ముఠాలుగా ఏర్పడుతున్నారా? లేక వారు ఎవరి తరపునైనా పనిచేస్తున్నారా?

ఉగ్రవాదులు ఎక్కడినుండో పుట్టుకురారు. వారు మన మధ్యనుండే తయారవుతారు. శత్రుదేశపు ఏజెంట్లు అమాయకులను మచ్చిక చేసుకుని, వారిని ఉగ్రవాదులుగా మారుస్తారు. ఇంకా గడ్డాలు, మీసాలైనా సరిగా రాని లేత వయస్సులోని యువకులను మతపరమైన, నాగరికతాపరమైన సిద్దాంతాలను నూరిపోసి లొంగదీసుకుంటారు. కాశ్మీర్లో ఇదే జరిగింది. అయితే ప్రత్యేక కాశ్మీర్ పోరాటం భారత్తో ముఖాముఖి తలపడలేని పాకిస్థాన్ సృష్టించిన ఉగ్రవాదమని గ్రహించిన కాశ్మీరీ యువకులు ఇందుకు దూరమై పెద్ద సంఖ్యలో భారత భద్రతా దళాలకు లొంగిపోయారు. దాంతో సూడాన్, సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాల నుండి కిరాయి సైనికులను పాకిస్థాన్ దిగుమతి చేసుకుని, వారిని భారత్పై ఉసిగొల్పుతున్నది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మనుషులు వీరికి ఆసరాగా ఉంటున్నారు. ఆయుధాల, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా వచ్చే డబ్బు వీరికి ముడుతుంది. ఈ ఉగ్రవాదుల నాయకులు తమ పని ముగిసిన తరువాత విదేశాలకు పరారవుతారు. ముంబాయి పేలుళ్ల వెనుక నున్న దావూర్ ఇబ్రహీం, అబు సలేం ఈ కోవకు చెందిన వారే. అయితే ఖైదీల అప్పగింత చట్టం పరిథిలో అబు సలేంను భారత్ లొంగదీసుకుని జైలుకు పంపింది. పేలుళ్లలో ప్రమేయం గల బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జైలు పాలయ్యాడు. దేశంలో చీకటి సామ్రాజ్యాన్ని పాలించే దావూద్ ఇబ్రహీం వంటి వారు అధిక వడ్డీలకు చలన చిత్ర నిర్మాణానికి కూడా ఆర్థిక సహాయం చేస్తారు. కొన్నిసార్లు ప్రముఖులను బెదరించి కూడా డబ్బు వసూలు చేస్తారు. దుబాయ్లో ఉన్నట్టు భావిస్తున్న ఇతడిని ఇంకా భారత ప్రభుత్వానికి అప్పగించవలసి ఉంది.


నేడు ఉగ్రవాదం దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ ప్రేరేపిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదులు పేట్రేగుతున్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో బోడో, ఉల్ఫా, నాగా ఉగ్రవాదులు ప్రజాజీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. ఉగ్రవాద వర్గాలకు బంగ్లాదేశ్ ఆశ్రయం కల్పిస్తున్నది.
అల్ ఖైదా, లష్కరీ తోయ్బీ, ముజాహిద్దీన్, జైషే మహ్మద్ లు అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు. వీటిలో అల్దా 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి చేసి, అనేక మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ వర్గం నాయకుడు మహ్మద్ బిన్ లాడెన్ అఫ్గానిస్థాన్లో తలదాచుకున్నట్టు భావించిన అమెరికా సంకీర్ణ దళాలతో ఆ ప్రాంతంపై దాడి చేసినప్పటికీ అతడి ఆచూక కనిపెట్టలేకపోయింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లపై అమెరికా నాయకత్వంలో జరిగిన దాడుల్లో పాల్గొన్నందుకు బ్రిటన్పై కూడా అలైదా దాడి చేసింది. 2000 జులై 7వ లండన్ భూగర్భ రైలు మార్గంలో, ఒక డబుల్ డెక్కర్ బస్సులో బాంబు పేలుళ్లు నిర్వహించినప్పుడు 56 మంది మరణించారు. మరి వెయ్యిమంది గాయపడ్డారు. మళ్లీ అదే నెలలో 21న లండన్ లోని భూగర్భ రైల్వేలో మూడు పేలుళ్లు, బస్సులో ఒక పేలుడు సంభవించాయి.


2008, నవంబర్ 26న ముంబయిలోని తాజ్, సి.ఎస్.టి.లపై ముష్కరులు దాడిచేసి పెద్ద ఎత్తున మారణ హోమంను సృష్టించారు. ఇటీవల 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ కూడ ఉగ్రవాద దాడులు మారణకాండ సృష్టించారు.


ఒకప్పుడు ఉగ్రవాదులు సాధారణ తుపాకులతోను, చేతి గ్రెనేడ్ తోను దాడులు చేసేవారు కనుక వారు తేలికగానే పట్టుబడేవారు. అయితే ఇప్పుడు వారు అత్యాధునిక పద్ధతులను అవలంబించటంతో వారిని పట్టుకోవటం పోలీసులకు సవాలుగా మారింది. ఉగ్రవాదులు తమ విధ్వంస కార్యకలాపాలకు పగడ్బందీగా వ్యూహం రూపొందించుకుని, సంఘటన స్థలానికి కొన్ని మైళ్ల దూరంలో ఉండి రిమోట్ కంట్రోల్ సాయంతో బాంబులు పేలుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *