Thu. Nov 30th, 2023

భారతదేశంలో నిరుద్యోగం, పేదరికం నిర్మూలన
● అర్హులైన అందరికి ఉపాధి అవకాశాలు కల్పించడం, పేద
రికాన్ని నిర్మూలించడం, తీవ్రమైన ఆదాయ అసమానతలు
లేకుండా చూడటమనేది భారత అభివృద్ధి ప్రక్రియలో భాగం
గానే ఉన్నాయి. అయితే సందర్భాన్ని బట్టి వ్యూహం లేదా
నమూనా మారుతూ వచ్చింది.

స్వాతంత్య్రానంతరం అధిక ఆర్థిక వృద్ధిని సాధించడం ద్వారా అర్హులైన అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించి నిరుద్యోగాన్ని, పేదరికాన్ని నిర్మూలించాలనే వ్యూహాన్ని అనుసరించారు. అంటే ‘అధిక వృద్ధి కోసం జరిగే పెట్టుబడుల వల్ల ఉత్పత్తి ప్రక్రియలో ఉద్యోగావకాశాలు పెరగడం, ఉద్యోగిత అధికం కావడంతో ఆదాయం పెరిగి పేదరికం తగ్గడం’ జరుగుతుందని భావించారు. దీనినే ‘ట్రికిల్ డౌన్ ప్రభావం’  అన్నారు. ఈ ప్రక్రియలో దాదాపు రెండు దశాబ్దాలు గడి
చాయి. ఈ రెండు దశాబ్దాల్లో వృద్ధి కొంతవరకు నమోదైనా నిరుద్యోగం పోలేదు. దీంతో నిరుద్యోగం, పేదరికాల నిర్మూలనకు ప్రత్యేక పథకాల అమలు ఆరంభమైంది. దీనిలో రెండు రకాల పథకాలు అమలు చేశారు.

1) వేతన ఉద్యోగిత పథకాలు

2) స్వయం ఉపాధి పథకాలు

• వేతన ఉపాధి పథకాలంటే ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఉపాధి కల్పించి వేతనం ఇస్తుంది. వేతనాన్ని కొన్ని సార్లు ఆహారం రూపంలో కూడా ఇచ్చారు. అప్పుడు దానిని పనికి ఆహార పథకం అన్నారు. కొన్నిసార్లు కొంత ఆహారం కొంత ద్రవ్య వేతనం ఇచ్చారు. కొన్నిసార్లు పూర్తి ద్రవ్య వేతనం ఇచ్చారు. ఈ కోవలో అనేక పథకాలు వివిధ రూపాల్లో అమలు జరిగాయి.

ప్రజా పనుల కార్యక్రమం (1971), పనికి ఆహార పథకం (1977), జాతీయ గ్రామీణ ఉపాధి పథకం(19980), భూమిలేని గ్రామీణులకు ఉపాధి పథకం (1983), జవహర్ రోజ్ గార్ యోజన (1989), ఉపాధిహామీ పథకం (1993), జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన (1999), సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన (2001), జాతీయ ఆహార పథకం(2004), మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(2005), ఈ చట్టం కింద అమల్లోకి వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (2006), పట్ట
ణాల్లో వేతన, స్వయం ఉపాధి కోసం ఆరంభించిన స్వర్ణజయంతి షహరీ రోజ్ గార్ యోజన (1997), గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ లాంటివన్నీ వేతన ఉపాధి పథకాలే.

స్వయం ఉపాధి: సొంతగా ఉపాధి పొందడానికి ప్రభుత్వం ఆరంభించినవే స్వయం ఉపాధి పథకాలు. కొన్ని సార్లు ఉపాధికి అవసరమైన శిక్షణను, సబ్సిడీతో కూడిన రుణాన్ని అందించి యువతకు ప్రభుత్వం సహకరిస్తుంది.

చిన్న రైతుల అభివృద్ధి కార్యక్రమం, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీల అభివృద్ధి కార్యక్రమం (1972-73), సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం (1978, 1980), స్వయం ఉపాధికై గ్రామీణ యువతకు శిక్షణ కార్యక్రమం(1979), గ్రామీణ ప్రాంత మహిళలు, శిశువుల అభివృద్ధి పథకం(1982), స్వర్ణయంతి గ్రామ్ స్వరోజ్ గార్ యోజన (1999), జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(2011), చదువుకున్న నిరుద్యోగుల ఉపాధి కోసం ఆరంభమైన ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన (1993),
ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (2008), జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ – అజీవక(2013), దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (2015), జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్(2013), దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్(2015), స్టార్ట్-అప్ ఇండియా పథకం (2016), స్టాండ్-అప్ ఇండియా (2016), ప్రధానమంత్రి కుషాల్ వికాస్
యోజన(2016), ప్రధానమంత్రి ముద్ర యోజన(2015) లాంటివన్నీ స్వయంఉపాధి కోసం చేయూతనివ్వడానికి ఆరంభించిన పథకాలే.

మానవాభివృద్ధి వ్యూహం: 1990వ దశకం నుంచి నిరుద్యోగం, పేదరిక నిర్మూలనకు మానవాభివృద్ధి వ్యూహాన్ని కూడా స్వీకరించారు. పేదరికంలో ఉన్న ప్రజలకు మంచి ఆర్యోగం, విద్య, శిక్షణను అందిస్తే ప్రపంచంలో వచ్చే అవకాశాలను వారు చేజిక్కించుకొని ఉపాధి పొంది, పేదరికం నుంచి బయటపడతారనే వ్యూహంతో ఎనిమిదో పంచవర్ష
ప్రణాళిక కాలంలో దీనిపై ప్రత్యేకదృష్టి పెట్టారు .

సమ్మిళిత వృద్ధి వ్యూహం: అన్ని రంగాల్లో వృద్ధిని సాధించడం, అన్నివర్గాల వారిని వృద్ధి ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం, వారందరికి వృద్ధి ఫలాలు అందేలా చూడటం కోసం సమ్మిళిత వృద్ధి వ్యూహాన్ని అనుసరించారు. ఇందుకోసం అన్ని వర్గాలకు అన్నిరకాల, అన్ని స్థాయుల్లో విద్యను అందుబాటులో ఉంచడం, ద్రవ్య సమ్మిళితాలను సాధనాలుగా భావించారు.

ద్రవ్య సమ్మిళితం కోసం అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు ద్రవ్య సేవలు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2011లో ప్రధానమంత్రి జనధన్ యోజనను ద్రవ్య సమ్మిళితం లక్ష్యంగానే ఆరంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *