Thu. Nov 30th, 2023

దేశంలో నిరుద్యోగ సమస్య గురించి విపులంగా రాయండి?
లార్డ్ కేన్స్ నిరుద్యోగం గురించి వ్యాఖ్యానిస్తూ, ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా అర్హతలకు తగిన ఉద్యోగం లభించకపోవటమే నిరుద్యోగమని నిర్వచించాడు. మనదేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. భారత్ వంటి వర్ధమాన దేశంలో జనాభా వేగంగా పెరుగుతోంది. జనాభాతో పాటే నిరుద్యోగులు కూడా పెరుగుతున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రరూపం దాల్చిందంటే పాలనావేత్తలు, విద్యావేత్తలు కూడా ఈ సమస్యకు తగిన పరిష్కారం కనుగొనలేకపోతున్నారు. ప్రజలకు తగిన ఉద్యోగాలను కల్పించడానికి ప్రభుత్వం రూపొందించిన అభివృద్ధి ప్రణాళికలన్నీ విఫలమయ్యాయి. 2012 నాటికి పూర్తయిన 11 పంచవర్ష ప్రణాళికలు నిరుద్యోగ సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపలేకపోయాయి. 1999 నాటికి దేశంలోని వివిధ ఉపాధి కల్పనా కేంద్రాల్లో మొత్తం 400 మిలియన్ల మంది ఉద్యోగార్థులు నమోదై ఉన్నారు. వీరిలో మెట్రిక్యులేట్లే కాక గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్లు, ఇంకా ఉన్నత విద్యావంతులైన ఇంజినీర్లు కూడా ఉన్నారు.

మనదేశంలో నిరుద్యోగం వివిధ రకాలుగా ఉంటుంది.

  1. బహిరంగ లేదా నిర్మాణాత్మక నిరుద్యోగం: ప్రజలు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వారికి పని దొరకదు. ఎక్కువ మంది ప్రజలు నగరాలకు, పట్టణాలకు వలస వచ్చినప్పుడు ఈ రకమైన నిరుద్యోగ పరిస్థితి నెలకొంటుంది.
  2. ప్రచ్ఛన్న నిరుద్యోగం: ప్రజలు ఉద్యోగంలో ఉన్నట్టే కనబడతారు. కానీ అది వారి, వారి స్థాయీలకు తగని ఉద్యోగంగా ఉంటుంది. వారి ఉత్పాదకత సున్నా అనే చెప్పవచ్చు. వీరు తమ ఉత్పాదకతను పెంచుకోవడానికి ఎటువంటి సహాయం లభించదు.
  3. కాలిక నిరుద్యోగం: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం పనులు ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే ఉంటాయి. చక్కెర, చెరకు, టపాసుల పరిశ్రమలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంది. తక్కిన కాలమంతా వీరు ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగానే ఉంటారు. ఈ తరహా నిరుద్యోగాన్ని కాలిక నిరుద్యోగమంటారు.
  4. ఆవృత నిరుద్యోగం: కొన్ని వస్తువులకు డిమాండ్ తగ్గటంతో సంబంధిత వస్తువుల తయారీ కార్మికులకు కూడా డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు ఉద్యోగాలు కోల్పోయే వారిని ఆవృత నిరుద్యోగులని అంటారు. మన దేశంలో పత్తి పరిశ్రమలో ఆవృత నిరుద్యోగం ఉంది. 5. భిన్న నిరుద్యోగం: చేస్తున్న పనికి భిన్నమైన పని చేయలేక నిరుద్యోగులుగా ఉండేవారిని భిన్న నిరుద్యోగులని అంటారు. ఒక వర్గం కార్మికులు తమకు అప్పగించిన పనులు పూర్తి చేసిన తరువాత అందుకు భిన్నమైన పనులు చేతకాకపోవటంతో ఖాళీగా ఉండవలసి వస్తుంది. అటువంటి వారిని భిన్న నిరుద్యోగులని అంటారు. పశ్చిమ దేశాల్లోనైతే ఇదేమంత తీవ్రమైన సమస్య కాదు. అక్కడ ఒక రకం పని అయిపోగానే మరో రకం పనికి అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. కానీ మనదేశంలో అటువంటి అవకాశాలు బహుస్వల్పం. కనుక ఈ తరహా నిరుద్యోగం ఇక్కడే చాలా ఎక్కువ.
  5. సాంకేతికపరమైన నిరుద్యోగం: కార్మిక వ్యయాన్ని పొదుపు చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశ్రమల్లో ప్రవేశపెట్టినప్పుడు తప్పనిసరిగా సిబ్బందిని తగ్గించవలసి వస్తుంది. ఆ విధంగా ఏర్పడే నిరుద్యోగాన్ని సాంకేతికపరమైన నిరుద్యోగం అంటారు. ఆధునీకరణ వల్ల ఉద్యోగాలు కోల్పోయే వారిని వీలయినంతవరకు ప్రత్యామ్నాయ ఉద్యోగాల్లో సర్దవచ్చు. ఇక తప్పనిసరిగా తొలగించవలసిన వారికి తగినంత నగదు ముట్టజెప్పితే వారు సంతోషంగా మరో దోవ చూసుకుంటారు. ఈ విధంగా ఉద్యోగి కంటనీరు చిందకుండానే సమస్యను పరిష్కరించవచ్చు. దీనినే పారిశ్రామిక వర్గాల్లో గోల్డెన్ హేండ్ షేక్ వ్యవహరిస్తారు.
  6. ఆకస్మిక నిరుద్యోగం: వర్షాలు పడకపోవటంతో కరవు కాటకాల వల్ల గ్రామస్తులకు ఉపాధి లభించదు. దీనిని ఆకస్మిక నిరుద్యోగం అంటారు. దేశంలో నిరుద్యోగ పరిస్థితి తీవ్రంగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది జనాభా సమస్య. మన జనాభా ఇప్పటికే వందకోట్లు దాటింది. జనాభా ఏటేటా 16 మిలియన్ల చొప్పున ఇంకా పెరుగుతోంది. అందువల్ల, ఎన్ని ఉద్యోగాలు సృష్టించినా సరిపోవటం లేదు. భారత్ సంపన్నదేశమైనప్పటికీ భారతీయులు పేదలు కావటం మరో కారణం. అంటే దేశంలో వనరులు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవటం లేదు. ఆనకట్టలు కట్టి నిరుపయోగంగా పడివున్న భూములను సాగులోకి తీసుకురావచ్చు. విద్యుచ్ఛక్తి ఉత్పత్తిని బాగా అభివృద్ధి చేయవచ్చు. భారతీయాత్మ గ్రామాల్లోనే ఉందని గాంధీజీ చెప్పినప్పటికీ వేలాది గ్రామాలకు నేటికీ కనీస వసతులు లేవు. అలాంటి గ్రామాలకు తారు రోడ్లను వేయవచ్చు. అక్కడ పాఠశాలలు, ఆస్పత్రులు గ్రంథాలయాలు ఏర్పాటు చేయవచ్చు.

సాంకేతిక విద్య, వృత్తిపరమైన విద్య తగిన స్థాయిలో లేకపోవటం కూడా నిరుద్యోగ సమస్యకు కారణం. విద్య ఉపాధి కల్పించేదిగా ఉండాలి. ప్రణాళికలను రూపొందించేటప్పుడు సాంకేతిక విద్యకు, పరిశ్రమల ఏర్పాటుకు మధ్య సమన్వయం సాధించాలి. ఎందుకంటే ఇంజినీరింగ్ కాలేజీలు ఇంజినీర్లను తయారు చేస్తుంటే వారికి ఉపాధి కల్పించడానికి తగినన్ని పరిశ్రమలను మాత్రం నెలకొల్పటం రైతుల్లో నిరుద్యోగానికి కుటీర పరిశ్రమలు క్షీణించి, మూతపడటం కూడా ఒక కారణం. యంత్రాలు తయారు చేసే వస్తువుల పట్ల మోజ పెరిగిన వినియోగదార్లు హస్తకళా వస్తువులను పట్టించుకోవటం మానేశారు.

నిరుద్యోగం అనేక సమస్యలకు దారితీస్తుంది. నిరుద్యోగం నిస్పృహకు దారితీస్తుంది. ఆ నిస్పృహతో కొందరు విద్యాధికులు విదేశాలు వలస వెళ్లిపోతారు. అందువల్ల దేశానికి మేధోనష్టం కలుగుతుంది. ఉపాధి లభించక, ఇంట్లో కుటుంబ సభ్యులు పస్తులు ఉంటుంటే చూడలే. కొందరు తీవ్రవాదులు గానో, ఉగ్రవాదులు గానో మారిపోతారు.

  1. వ్యవసాయంపై ఆధారపడడం: అవసరానికి మించిన జనాభా వ్యవసాయంపై ఆధారపడడం వల్ల ఈ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎక్కువగా
    ఉంది.
  2. గ్రామీణ జనాభా వలన: గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు లేక పట్టణాలకు వలస రావడం వల్ల పట్టణాలలో నిరుద్యోగిత పెరుగుతోంది.
  3. విద్యా విధానం: ప్రస్తుతం ఉన్న విద్యావిధానం వృత్తి విద్యకు ప్రాధాన్యం కల్పించకపోవడం వల్ల పట్టభద్రులవుతున్నారు కానీ, వృత్తిపర నైపుణ్యాలు కొరవడిన కారణంగా నిరుద్యోగులుగా మిగులుతున్నారు. విద్యా ప్రమాణాలు నాసిరకంగా ఉండడంవల్ల పట్టభద్రులైన వారు కూడా ఉద్యోగాలకు పనికి రాకుండా పోతున్నారు.
  4. శిక్షణా వపతుల కొరత: ప్రస్తుతం భారతదేశంలో ఉన్న శ్రామిక శక్తిలో ఎక్కువమంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. శ్రామికులకు మారుతున్న సాంకేతిక విజ్ఞానానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉన్నందువలన శ్రామికుల్లో గమనశీలత లోపిస్తుంది. అంతేగాక శ్రామికులు పనిచేసే పరిశ్రమలలో కొత్త ఉత్పత్తి పద్ధతులు ప్రవేశపెట్టినపుడు నిరక్షరాస్యులయిన శ్రామికులు వాటిలో సుశిక్షితులు అయ్యే అవకాశాలు లేకపోవడం వలన వారు నిరుద్యోగులుగానే మిగిలిపోవలసి వస్తున్నది.
  5. నవరులను పక్రమంగా వినియోగించుకోలేకపోవడం: మన దేశంలో సహజవనరులు కావలసినన్ని ఉన్నాయి. అయితే వాటిని సక్రమంగా వినియోగించుకోలేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతున్నది.
  6. మూలధనం కొరత : దేశంలో అత్యధిక మంది ఆదాయం వారి ఖర్చులకే సరిపోతోంది. ఫలితంగా పొదుపు తక్కువగా ఉంటోంది. దానితో మూలధనం కొరత ఏర్పడి కొత్త పరిశ్రమల స్థాపన ఆగిపోయింది. అయితే ధారళంగా వస్తున్న విదేశీ పెట్టుబడుల వల్ల ఇప్పడిప్పుడే ఈ పరిస్థితి
    మెరుగుపడుతోంది.
  7. పరిశ్రమలు, మౌలిక రంగాల స్వల్ప అభివృద్ధి: మౌలిక రంగాలలోను, పరిశ్రమల రంగాలలో ఆశించిన వృద్ధి రేటు లేకపోవడం వల్ల ఉద్యోగావకాశాలు మెరుగు పడడం లేదు.
  8. పంబద్ధీకరణ: ఉత్పత్తి ఖర్చులను తగ్గించి ఉత్పత్తిని ద్విగుణీకృతం చేయడానికి ఇటీవల కొన్ని పరిశ్రమలలో సంబద్ధీకరణ ఆధునికీకరణలను ప్రవేశపెట్టడం వల్ల కొంత మంది ఉద్యోగాలను కోల్పోవడంతో నిరుద్యోగిత పెరిగింది.
  9. ప్రాంతీయ, ఆదాయ పంపిణీల్లో అసమానతలు: పెట్టుబడుల కేంద్రీకరణ కొన్ని ప్రాంతాలలోనే ఉండడం వల్ల మిగిలిన ప్రాంతాలలో నిరుద్యోగం
    అధికంగా ఉంది.
  10. సాంఘిక వ్యవస్థ: మూఢనమ్మకాలు, కర్మ సిద్దాంతం, ఉమ్మడి కుటుంబం అనేవి ప్రజలలో గమనశీలతను నిరోధిస్తూ నిరుద్యోగాన్ని పెంపొందిస్తున్నాయి.
  11. ప్రభుత్వ విధానాలు: జనాకర్షణ పథకాలకే ప్రాధాన్యం ఇవ్వడం, స్వల్పకాలిక చర్యలకే పరిమితం కావడం, ప్రభుత్వోద్యోగాలలో నియామకాలు తగ్గించివేయడం నిరుద్యోగాన్ని పెంచుతున్నాయి.
  12. కుటీర పరిశ్రమలు (Cottage Industries) క్షీణించడం: బ్రిటిష్ వారి వలస ఆర్థిక విధానం వల్ల ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గడించిన మనచేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు క్షీణించి నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించలేకపోతున్నది.
  13. మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల కాలంలో నిరుద్యోగ నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయకున్నా గ్రామీణ ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం సమాజాభివృద్ధి కార్యక్రమాలను మొదటి పంచవర్ష ప్రణాళికారంభంలోనే ప్రారంభించింది. 1960లో వ్యవసాయరంగ అభివృద్ధికి, ఉద్యోగావకాశాల కల్పనకు విస్తృత వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఉత్పత్తికి దోహదం చేసే శ్రమసాంద్ర (Labour intensive) పద్ధతులను ఉపయోగించి గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ఈ పథకం ఉద్దేశ్యం.
  14. నాలుగవ పంచవర్ష ప్రణాళికా కాలం నుంచి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ఉద్యోగ పథకాలను రూపొందించింది. సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థను (SFDA) ఏర్పాటు చేసి పరపతి సౌకర్యాలు కల్పించారు. ఉపాంత వ్యవసాయదారుల, వ్యవసాయ కూలీల అభివృద్ధి (MFAZDA) పథకం ద్వారా ఉపాంత వ్యవసాయ (Marginal Farmers) దారులు, వ్యవసాయ కూలీల కుటుంబాలకు సబ్సిడీపై పాడి, మత్స్య, కోళ్ళ పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు ఇచ్చారు. క్షామపీడిత ప్రాంతాలలోని రైతుల కోసం గ్రామీణ పనుల కార్య క్రమాన్ని (Rural Works Programme) 1970–71లో ప్రారంభించారు. చిన్న తరహా నీటి పారుదల సౌకర్యాలు, భూసార పరిరక్షణ, సామాజిక అడవుల పెంపకం ద్వారా గ్రామ ప్రాంతాలలో ఉపాధి కల్పన దీని ఉద్దేశ్యం. 1973లో దీనిలో కొన్ని మార్పులు చేసి ప్రపంచ బ్యాంకు సహాయంతో ఆయకట్టు అభివృద్ధి పథకాన్ని (కమాండ్ ఏరియా డెవలప్మెంట్) ప్రారంభించారు.
  15. ఐదవ పంచవర్ష ప్రణాళికారంభంలో గ్రామీణాభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టారు. కనీస అవసరాల పథకాన్ని ప్రారంభించి అట్టడుగు 30 శాతం ప్రజల తలసరి వినియోగాన్ని పెంచడానికి ప్రయత్నాలు సాగించారు. 1977లో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడం వల్ల పనికి ఆహారం పథకం అమలు చేశారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ఎడారి ప్రాంతాల అభివృద్ధికి 1978-79లో ఒక కార్యక్రమం ప్రారంభించి పశుసంవర్ధక కార్యక్రమాలను ప్రోత్సహించారు. ఆ తరువాత పనికి ఆహారం స్థానంలో జాతీయ గ్రామీణ ఉద్యోగిత పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో సంఘటిత గ్రామీణాభివృద్ధి కార్యక్రమాన్ని (IRDP) రూపొందించారు.
  16. 1983లో గ్రామీణ ప్రాంతాలలో భూమిలేని ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తికి 100 రోజుల పని కల్పించడానికి భూమిలేని గ్రామీణ ప్రజల భద్రతా పథకం (RLEGP) రూపొందించారు. తక్కువ ఆదాయ వర్గాలలోని నిరుద్యోగ గ్రామీణ యువకులకు స్వయం ఉపాధికి అవసరమైన శిక్షణ కొరకు 1979లో గ్రామీణ యువకుల స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాల (TRYSEM) పథకం ప్రారంభించారు. పట్టణ పేదవారిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి 1986లో పట్టణ పేదల స్వయం ఉపాధి పథకాన్ని (SEUP) ప్రవేశపెట్టారు.
  17. RLEGP, NREP పథకాలను విలీనం చేసి 1989 నుంచి జవహర్ రోజ్ గార్ యోజన పథకం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది. పట్టణ నిరుద్యోగితను నిర్మూలించుటకు 1989లో నెహ్రూ రోజ్ గార్ యోజన (NRY) పథకాన్ని ప్రవేశపెట్టారు. లఘు పరిశ్రమలు, వ్యాపార కార్యక్రమాల వంటి స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా 8వ ప్రణాళికలో 10 లక్షలమంది విద్యావంతులయిన నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు 1993లో ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన (PMRY) ను ప్రవేశపెట్టారు. క్షామ ప్రాంతాలకు, షెడ్యూల్డు తెగలు, కొండ ప్రాంతాలు, ఎడారీ ప్రాంతాలకు చెందిన బ్లాక్తులలో గ్రామీణ పేదలకు ఉద్యోగ హామీ పథకాన్ని 1993లో ప్రారంభించారు.
  18. 9వ ప్రణాళికలో పేదరిక నిర్మూలన సాధించే విధంగా గ్రామీణాభివృద్ధి గ్రామీణ ఉపాధి కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. సంవత్సరానికి 8 మిలియన్ల చొప్పున ఉపాధి అవకాశాన్ని కల్పించడం లక్ష్యంగా ఈ ప్రణాళిక పేర్కొంది.
  19. గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగుల కోసం 1999లో స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్ గార్ యోజన (SGSY)ను, జవహర్ గ్రామ సమృద్ధి యోజనను, సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజనను ప్రవేశపెట్టారు. అప్పటివరకు అమ లులో ఉన్న ఐఆర్డ్పి, ట్రైసమ్, డ్వాక్రా, జికెవై, మిలియన్ బావుల పథకం వంటి పథకాల స్థానంలో ఏకైక స్వయం ఉపాధి పథకంగా ఎస్టిఎస్వై పథకాన్ని ప్రారంభించారు. జవహర్ రోజ్ గార్ యోజన స్థానంలో గ్రామీణ పేదలకు నిరంతర ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో జవహర్ గ్రామ సమృద్ధి యోజనను ప్రారంభించారు. పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగుల కోసం అప్పటి వరకు అమలులో ఉన్న నెహ్రూ రోజ్ గార్ యోజన, అర్బన్ బేసిక్ సర్వీసెస్ ఫర్ పూర్, ప్రైమ్ మినిస్టర్స్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రాం (PMIUPEP) వంటి పథకాలను విలీనం చేసి 1997 లో స్వర్ణజయంతి షహరి రోజ్ గార్ యోజనను ప్రవేశపెట్టారు, బాగా వెనక బడిన జిల్లాల్లోని నిరుద్యోగుల కోసం 2002లోనే జయప్రకాశ్ రోజ్ గార్ గ్యారంటీ యోజనను ప్రారంభించారు. 2002లోనే సంపూర్ణ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రారంభించారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఉపాధి అవకాశాలు సృష్టించే రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు 10వ ప్రణాళిక పేర్కొంది. 2002-07 మధ్యకాలంలో 5 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఈ ప్రణాళికలో లక్ష్యంగా పెట్టుకొన్నారు.
  20. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ నిరుపేదలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ 2006 ఫిబ్రవరి 2న అనంతపూర్ లోని బండ్లపల్లిలో ప్రారంభించారు. యుపిఎ అజెండాలో నిర్దేశించిన విధంగా గ్రామీణులకు గౌరవ ప్రదమైన జీవనాన్ని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2005 సెప్టెంబర్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని చేసింది. ఆ చట్టానికనుగుణంగానే ఈ పథకాన్ని 2006 ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభించారు. ఈ పథకాన్ని ముందుగా దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్ 16 జిల్లాల్లో అమలు చేశారు. (తర్వాత మరో 3 జిల్లాలకు విస్తరించారు). 2007 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా మరో 130 జిల్లాలకు విస్తరించారు. 2008 ఏప్రిల్ 1 నుంచి దేశంలోని 595 జిల్లాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ప్రతి గ్రామీణ నిరుపేద కుటుంబంలో కనీసం ఒకరికి సంవత్సరానికి 100 రోజుల పాటు ఉపాధిని కల్పిస్తున్నారు. ఈ పథకం అంతిమ పర్యవేక్షణాధికారం స్థానిక పంచాయతీరాజ్ సంస్థలదే.

అసలే కడుపు మంటతో వ్యవస్థ పట్ల ద్వేషం పెంచుకున్న ఈ యువతీయువకులు నాయకుల ఉద్రేకపూరిత ప్రసంగాలకు ఆవేశంతో ఊగిపోయి బుట్టలో పడిపోతారు. తరువాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వారి జీవితం బుగ్గి అయిపోతుంది. అదే వారి జీవితానికి చరమాంకం.

విరుద్యోగ సమస్యకు కారణాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *