యూకే కేంద్రంగా పనిచేస్తున్న డెలివరూ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ (ఐడీసీ)లో కొత్తగా 70 మంది ఉద్యోగులను నియమించుకోనుంది. ఇందులో ప్రధానంగా కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ లాంటి సాంకేతికతలపై పట్టు ఉన్న నిపుణులు ఉండనున్నారు. ఐడీసీని ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా సంస్థ సీఈఓ విల్ షూ మంగళవారం తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి, సంస్థ కార్యకలాపాలను వివరించారు. యూకేకు వెలుపల అతి పెద్ద టెక్ హబ్ గా ఐడీసీ ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ 140 మంది నిపుణులు ఉన్నారని పేర్కొ న్నారు. ప్రాంగణ నియామకాలనూ చేపట్టబోతున్నట్లు తెలిపారు.