Thu. Nov 30th, 2023

తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఉద్యోగాలకు కేవలం మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 475 కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హతలు ఉన్న మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 5 జూలై 2023 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగం పేరు కాంట్రాక్ట్ లెక్చరర్

మొత్తం ఖాళీల సంఖ్య 1241

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు

స్పెషల్ ఆఫీసర్: 38

ఇంగ్లీష్ pgcrt : 110

గణితం pgcrt : 60

నర్సింగ్ pgcrt : 160

తెలుగు pgcrt : 104

ఉర్దూ pgcrt : 2

వృక్షశాస్త్రం pgcrt : 55

కెమిస్ట్రీ pgcrt : 69

సివిక్స్ pgcrt : 55

కామర్స్ pgcrt : 70

ఎకనామిక్స్ pgcrt : 54

ఫిజిక్ pgcrt : 56

బయో సైన్స్ సి ఆర్ టి : 25

ఇంగ్లీష్ సిఆర్టి : 52

హిందీ సి ఆర్ టి : 37

ఫిజికల్ సైన్స్ సిఆర్టి : 42

గణితం సిఆర్టి : 45

సోషల్ స్టడీస్ సిఆర్టి : 26

తెలుగు సి ఆర్ టి : 27

ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ : 77

విద్యార్హతలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పీజీ బీఈడీ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్లో బీఈడీ లేదా bp.ed ఉత్తీర్ణత సాధించి ఉండాలి

వయస్సు పరిమితి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 17 జూలై 2023 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ, ఎస్టీ, బిసి లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకూ వయసు పరిమితిలో సడలింపు ఉంటుంది

ఎంపిక విధానం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వివిధ పోస్టుల ను బట్టి రాత పరీక్ష లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది వివిధ పోస్టుల ను బట్టి వెయిటేజీ మరియు అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది

దరఖాస్తు ఫీజు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 600 రూపాయలు దరఖాస్తు ఫీజు కూడా ఆన్లైన్లో చెల్లించాలి

ఆసక్తి మరియు అర్హతలు ఉన్న మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ అధికారిక వెబ్సైట్ ద్వారా 26 జూన్ 2023 నుంచి 5 జూలై 2023 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

Apply OnlineClick Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *