తెలంగాణ రాష్ట్రంలో వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1, 2,4 నోటిఫికేషన్లు విడుదలవ్వగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 5204 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టుల సహా మరికొన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 25 జనవరి 2023 నుండి 15 ఫిబ్రవరి 2023 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.