Thu. Nov 30th, 2023

తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసు లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 97

అర్హత: ఇంటర్మీడియట్ లేదా దానికి సమాన మైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ణీత విద్య, సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ ఉన్న అభ్య ర్థులు ధ్రువపత్రాల పరిశీలన సమయంలో సర్టి ఫికెట్లు అందజేయాలి.

వయసు: 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదే ళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.22,240 నుంచి రూ. 67,300 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: సీబీటీ / ఓఎమ్మార్ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీ టీ)/ ఓమ్మార్ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్ విభాగంలో 60, జనరల్ ఇంగ్లిష్ విభాగంలో 40 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 11.01.2023.
  • ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.01.2023.
  • హాల్ టిక్కెట్ డౌన్లోడ్ ప్రారంభతేది: 15.02.2023.
  • పరీక్ష తేది: మార్చి 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *