విజయ వాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు-2 పరిధిలోని అంగన్ వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, ఆయా పోస్టులు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సీడీపీఓ జి.మంగమ్మ ప్రకటనలో తెలిపారు.
విజయవాడ ప్రాజెక్టు -2 పరిధిలోని 11వ డివిజన్ జార్జిపే లో అంగన్వాడీ కార్యకర్త ఓసీ కేటగిరి, 2వ డివిజన్ మనవరం -1 నందు ఎస్సీ కేటగిరి, 14వ డివిజన్ శ్రీనివాస్ నందు ఓసీ కేటగిరి, 16వ డివిజన్ మధురానగర్ బీసీ -డి కేటగిరి, 17వ డివిజన్ ద్వారకానగర్ నందు ఎస్టీ కేటగి రి, రాణిగారితోట-2 నందు ఓసీ కేటగిరి, 22వ డివిజన్ డ్రైవర్ పేట-2 నందు బీసీ-బి కేటగిరికి కేటాయించామన్నారు.
గొల్లపూడి, రామవ రప్పాడు నందు ఓసీ కేటగిరి అభ్యర్థులకు అం గన్వాడీ సహాయకురాలు పోస్టులను కేటా యించడం జరిగిందన్నారు. ప్రసాదంపాడు. -8 నందు మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టు లను భర్తీ చేస్తామన్నారు. అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ పోస్టులకు 21 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీ ర్ణత పొందిన వారు అర్హులని పేర్కొన్నారు. వివాహితురాలై స్థానికంగా ఉండాలన్నారు. దరఖాస్తులను ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పెనమలూరు మండలం కానూరు కార్యాలయంలో వ్యక్తిగతంగా అందజేయాలని మంగమ్మ కోరారు.
![]() | వాట్సాప్ గ్రూప్ లింక్ |
![]() | బిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ |