Sat. May 25th, 2024

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జులై 7న విశాఖపట్నం జిల్లా గాజువాక వికాస్ నగర్ స్టీల్ సిటీలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 11 బహుళజాతి సంస్థలు పాల్గొననున్నాయి. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు

మొత్తం పోస్టులు: 457

జాబ్ లొకేషన్లు: విశాఖపట్నం, గాజువాక, కూర్మనపాలెం, అనకాపల్లి, నర్సీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తుని, దువ్వాడ, అచ్చుతపురం, మధురవాడ, యూసఫ్గూడ, హైదరాబాద్.

కంపెనీ పేరుపోస్టుల వివరాలు
నవత రోడ్ ట్రాన్స్పోర్ట్బ్రాంచ్ ఇంఛార్జ్, వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, క్లర్కు, క్యాషియర్, డ్రైవర్
సినర్జీ కాస్టింగ్స్ లిమిటెడ్ట్రైనీ/ ఆపరేటర్ ట్రైనీ
టీమ్జ్వైర్ మ్యాన్
టీమీజ్ఇన్స్టాలేషన్ ఇంజినీర్
వెబ్ ప్రో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్మెషిన్ హెల్పర్, ప్యాకింగ్ హెల్పర్, డెలివరీ బాయ్స్
వెబ్ ప్రో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్
వెబ్ ప్రో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
జయభేరి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్సర్వీస్ అడ్వైజర్స్, పెయింటర్స్, డెంటర్స్, కస్టమర్ కేర్ అడ్వైజర్, సిస్టమ్ ఆపరేటర్
డెక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ట్రైనీ కెమిస్ట్
హోబెల్ బెలోస్ కంపెనీట్రైనీ ఇంజినీర్లు
వెబ్ ప్రో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ప్రొడక్షన్ సూపర్వైజర్
హోబెల్ బెలోస్ కంపెనీషార్ప్ ఫ్లోర్ సపోర్టర్స్
యోకోహామా ఆఫ్ హైవే టైర్ఉమెన్ అప్రెంటిస్ ట్రైనీ
సెయింట్ గోబియన్ట్రైనీ
బీడేటా టెక్నాలజీస్వెబ్ డెవలపర్, యూఎస్ ఐటీ బెంచ్ సేల్స్ రిక్రూటర్, యూఎస్ ఐటీ రిక్రూటర్
డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్అసోసియేట్స్

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, తదతర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: ఖాళీని అనుసరించి 18 నుంచి 35 ఏళ్ల వయసున్నవారు అర్హులు

జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ.10,000 నుంచి రూ.30,000 వరకు.

ఎంపిక: విద్యార్హతలతో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.

నిర్వహణ వేదిక: ప్రభుత్వ ఐటీఐ కళాశాల, వికాస్ నగర్ స్టీల్ సిటీ, గాజువాక, విశాఖపట్నం జిల్లా

వెబ్సైట్: https://www.apssdc.in/home/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *